HomeCRIMEరాజకీయ రచ్చగా మారిన దాడి ?తెరవెనుక అధికార పార్టీ నేతలున్నారంటున్న గులాబీ నేతలు ......ముందస్తు చర్యల...

రాజకీయ రచ్చగా మారిన దాడి ?తెరవెనుక అధికార పార్టీ నేతలున్నారంటున్న గులాబీ నేతలు ……ముందస్తు చర్యల కు సిద్ధం అయిన పోలీసు శాఖ

నాగారంలో నడి రోడ్డు మీద ఏకంగా మేయర్ భర్త శేఖర్ మీద హత్య యత్నం ఘటన రాజకీయ రచ్చ గా మారింది. ఈ దాడి వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం వుందని గులాబీ నేతలు అనుమానిస్తున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేరుగా రంగంలోకిదిగారు.

మాజీ ఎమ్మెల్యే బిగాల హుటాహుటిన సంఘటన జరిగిన వెంటనే నిజామాబాద్ వచ్చారు. శేఖర్ ను పరామర్శించారు మేయర్ ను ఓదార్చారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇద్దరు నేతలు కలిసి ఇంచార్జ్ కమిషనర్ తోనూ మాట్లాడారు. అధికార పార్టీ నేతలే లక్ష్యంగా నిప్పులు చెరిగారు.

మరో వైపు అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ సైతం ఆసుపత్రి కి వెళ్లి శేఖర్ ను పరామర్శించారు దాడి ఖండించారు. దీనితో ఒక్కసారి గా రాజకీయ రచ్చకు తెరలేపింది. అధికార పార్టీ నుంచి ఇంకా ఎలాంటి కౌంటర్ రాలేదు కీలక నేతలందరూ వరంగల్ లో సీఎం సభ కు వెళ్లారు.

వారి నుంచి సంఘటన జరిగిన ప్రాంతంలో అధికార పార్టీ కీలక నేతల అనుచరులు హడావుడి చేశారని చెపుతున్నారు. అదీగాక తాను కాంగ్రెస్ కార్యకర్త నని పార్టీ నేతలు తనను ఆదుకోవాలి బయటికి వస్తే తనను బతకనియ్యారంటూ నిందితుడు సెల్ఫీ వీడియో కలకలం రేపింది.

తదుపరి ఎలాంటి అనర్థాలు తలెత్తకుండా కట్టడి చెయ్యాలనేది పోలీసు ల కార్యాచరణ గా ఉంది పోలీసులు అప్రమత్తం అయ్యారు. అందుకే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

మరో వైపు శేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన పర్యవసానాలు అంచనా వేసిన పోలీసు లు అప్రమత్తం అయ్యారు ఏసీపీ స్వయంగా రంగంలోకి దిగారు బాధితుడి తో మాట్లాడి ఘటనకు దారితీసిన పరిస్థితులను వాకబు చేసి కొద్దీ గంటల వ్యవధి లోనే ప్రత్యేక బృందం ను రంగంలోకి దించారు.

దాడికి పాల్పడిన నిందితుడి ని పట్టుకొని మరుసటి రోజే అరెస్ట్ సైతం ప్రకటించారు. నిందితుడి ని ఏసీపీ నేరుగా విచారించినట్లు సమాచారం తాను ఏ పరిస్థితుల్లో దాడి చేయాల్సి వచ్చిందో చెప్పాడు గత కొన్నేళ్లుగా స్థలం కోసం ఎలా పోరాటం చేస్తుంది చెప్పి నట్లు తెల్సింది.

శేఖర్ చుట్టూ అనేక సార్లు తిరిగి స్థలం జోలికి రావద్దని ప్రాధేయపడ్డానని అయినా ఆయన వర్గీయులు ఆగడాలు ఆగక పోవడం వల్లే దాడికి తెగబడ్డానని నిందితుడు పేర్కొన్నట్లు తెల్సింది. మరికొన్ని నివ్వెర పోయే విషయాలు వెల్లడించారని ప్రచారం జరుగుతుంది.

స్థల వివాదం నేపథ్యంలోనే ఈ దాడి జరిగినప్పటికి మరో మలుపు తీసుకుంటుండడంతో పోలీసులు అన్నీ కోణాల్లో విచారిస్తున్నారు. నిందితుడి వెనుక ఎవరున్నారనేది అరా తీస్తున్నారు. దాడి వెనుక ఇంకా ఎవరెవరున్నారనేదిపక్కాగా నిర్దారించుకునే పనిలో ఉన్నారు సంఘటన జరిగిన ప్రాంతంలో ఇంకా ఎవరెవరున్నారో సెల్ లొకేషన్ ఆధారాలను తెప్పిస్తున్నారు.

దాడి కి గురి అయిన శేఖర్ అదేప్రాంతంలో బలమైన అనుచర వర్గం ఉంది అయినప్పటికి ఒక్కడే వెళ్లి శేఖర్ దాడి కి ఎలా తెగబడ్డ డనేది ఎవరికి అంతు చిక్కడం లేదు.నిందితుడు రసూల్ . ఆటో నడుపుతు జీవనం సాగిస్తున్నరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం కేటాయించారు

ఈ మేరకు రెవెన్యూ అధికారుల నుంచి పట్టా కూడా ఉంది అయితే గత కొన్నేళ్లుగా ఆ స్థలం తమదంటూ ఓ వ్యక్తి రంగంలోకి వచ్చారు. అతను శేఖర్ అనుచరుడు కావడంతో రసూల్ అనేక సార్లు శేఖర్ ను ఆశ్రయించాడు. అయినప్పటికి ఆస్థలం విషయంలో వివాదం సాగుతూనే ఉంది. శేఖర్ మొన్నటిదాకా అధికార పార్టీ లో కొనసాగడంతో రసూల్ సైలెంట్ గా ఉన్నారు.

కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి ఉన్న నేపథ్యంలో రసూల్ ఒక్కడే అదికూడా శేఖర్ అడ్డా లో దాడి కి తెగబడడం వెనుక ఎవరైనా స్కెచ్ వేసారని కోణం లోను పోలీసులు విచారణ సాగుతుంది.బిఆర్ యస్ నేతలు సైతం శేఖర్ పక్షాన బలంగా నిలబడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments