ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి వక్తికి గాయాలైన ఘటన నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సమీపంలో చోటు చేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం..
నగరంలోని శివాజీ నగర్ కు చెందిన గాండ్ల నర్సింలు(50).ఆదివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి వక్తికి గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
