రూ1 .18 లక్షలకు దక్కించుకున్న భక్తుడు గణపతి లడ్దు ను దక్కించుకోవడానికి ఉన్న పోటీ ఇప్పడు దేవీమాత వద్ద ఉండే పాన్ వచ్చింది.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరం లోని కోటగల్లి బంగారు మైసమ్మ ఆలయం లోదేవి మాత వద్ద పాన్ ను ఉంచి పూజలు చేసి ఆ పాన్ ను వేలం వేయడం ఆనవాయితీ గా వస్తుంది.
ఈసారి నాలుగోవా రోజు మహా లక్ష్మి అవతారం లో అలకంరణ చేసారు మాత వద్ద వున్నా పాన్ కు ఆదివారం వేలం పాట నిర్వహించారు.
అమ్మవారి వద్ద పాన్ దక్కించుకుంటే అన్నిటికి మంచిదని బలంగా నమ్మే భక్తులు ఆ పాన్ దక్కించుకోవడానికి పోటీ పడ్డారు కాలనీ కి చెందిన సృజన్, ప్రీతీ దంపతులు ఈ పాన్ ను లక్ష 18 వేల రూపాయలకు దక్కించుకున్నారు .
