నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచిన యజమానికి ఒక రోజు జైలుశిక్ష విధించినట్లు ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
బాబన్ సాహెబ్ పహాడ్‌కు చెందిన అబ్దుల్ హఫీ అర్ధరాత్రి వరకు టీ పాయింట్ తెరిచి ఉంచాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గురువారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా వ్యక్తికి ఒక్క రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
