కామారెడ్డి స్టార్ హాస్పిటల్ లో ఫేక్ డాక్టర్ కలకలం రేపింది. మూడేళ్లు గా అదిలాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ ఆసుపత్రిలో డాక్టర్ గా చెలామణి పేక్ డాక్టర్ భరతం పట్టారు పోలీసులు.
మందమర్రి మండలం రామకృష్ణ పూర్ కు చెందిన ముల్కల రవీందర్ , అలియాస్ డాక్టర్ రవీందర్ రెడ్డి పేరుతో చలామణి అవుతున్నాడు కనీసం డిగ్రీ కూడా చదవని రవీందర్, గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు ఫేక్ సర్టిఫికెట్స్ ను అవికూడా డాక్టర్ రవీందర్ రెడ్డి పేరుతో సృష్టించి కామారెడ్డి కేంద్రంగా డాక్టర్ వృత్తిని మొదలు పెట్టారు
మొదట ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ షణ్ముఖ ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ గా పనిచేయడానికి యాజమాన్యం తో రూ 2లక్షలకు ఒప్పందం చేసుకున్న డు . ఫేక్ సర్టిఫికెట్స్ తో డాక్టరుగా చలామణి అవుతున్న రవీందర్ ను కామారెడ్డి పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.
అతన్ని అదుపులోకి తీసుకోని విచారించడంతో బోగస్ సర్టిఫికెట్ గుట్టు రట్టు అయింది అంతే కాదు అతని వద్ద ఫేక్ ఆధార్ కార్డు,కూడా లభ్యం అయింది నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు
