HomeCRIMEదాడి కేసులో వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష..

దాడి కేసులో వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష..

వ్యక్తిని దాడి చేసిన ఘటనలో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ 1000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రథమ కోర్టు తీర్పు తెలిపినట్లు రూరల్ ఎస్ఐ అరీఫ్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..

నగరంలోని రైల్వే క్వార్టర్స్ పరిధిలో షేక్ అహ్మద్ రైల్వే విభాగంలో గ్యాంగ్మెన్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన కర్రెమొల్ల సురేష్ వ్యక్తిగత విభేదాల కారణంగా షేక్ అహ్మద్ ను హాకీ కర్రతో దాడి చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జగదీశ్ కేసు నమోదు చేసి చార్జి షీట్ దాఖలు చేయగా, బాధితుడి తరుపున అడిషనల్ పబ్లిక్ ప్రొసీక్యూటర్ భూసారపు రాజేష్ వాదనలు వినిపించగా మంగళవారం ప్రథమ కోర్టు జడ్జీ శ్రీనివాస్ నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ 1000 జరిమానా విధించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments