ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లా లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ లకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఓ కానిస్టేబుల్ సైతం మృతి చెందినట్టు సమాచారం.
అభూజ్‌మడ్ అడవుల్లో 12 గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
