HomeEditorial Specialస్థానిక సమరానికి కాంగ్రెస్ సమాయత్తం

స్థానిక సమరానికి కాంగ్రెస్ సమాయత్తం

……7 న సన్నాహకసమావేశం ……దిశానిర్దేశం చేయనున్న అగ్ర నేతలు ……హాజరు కానున్న ఏఐసీసీ ఇంచార్జ్ , పీసీసీ చీఫ్ లు @@@@ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో పార్టీబలోపేతం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది.ఎలాంటి అవాంతరాలు వచ్చినా సరే అధిగమించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

మొదట సర్పంచ్ ఆతర్వాత యంపిటీసీ జెడ్పిటిసి ఎన్నికలకు పక్రియ జరిపే లా ప్రభుత్వం కార్యాచరణ ఉంది. ఈ మేరకు పీసీసీ నుంచి సైతం పార్టీ కీలక నేతలందరికి స్పష్టమైన సంకేతాలు సైతం వచ్చాయి. రైతు భరోసా మొదటి దఫా నిధులు రైతు ఖాతాల్లో జమ అవ్వగానే ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం పక్కా ప్రణాళిక తో ఉంది. అందుకే పీసీసీ సైతం ఆ మేరకు పార్టీ క్యాడర్ ను లోకల్ ఎన్నికలకు సిద్ధం చేసే దిశగా కార్యాచరణ మొదలు పెట్టింది.

లోకల్ బాడి ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని ఈపాటికే అన్నీ డీసీసీలకు స్పష్టం చేసిన పీసీసీ ఎంపీ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు షెడ్యూల్ ఖరారు చేసింది.పీసీసీ అధ్యక్షడు సొంత జిల్లా నుంచే సమావేశాల షెడ్యూల్ మొదలు కాబోతుంది. లోకసభ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షి పీసీసీ చీఫ్ లతో పాటు అవసరమైతే ఇతర పార్టీ పెద్దలు కూడా హాజరు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ నెల 7 న నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ స్థాయి సమావేశం డిచ్ పల్లి మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో ఏర్పాటు చేసారు.దీపా దాస్ మున్షి .పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ లతో పాటు జిల్లాకు చెందిన దిగ్గజ నేతలందరినీ ఆహ్వానించారు. ముందుగా ఆయానియోజకవర్గాల్లో సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేసి ఆ తరువాత తదుపరి కార్యాచరణ కు సిద్ధం కావాలనేది పీసీసీ ఆలోచన గాఉంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాకపోతే ప్రభుత్వ ప్రతిష్ట మసక బారే ప్రమాదం ఉంది.

అదీగాక బిఆర్ యస్ పదేళ్లు అధికారంలో వుండడం వల్ల ఇంకా క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో చేరిక లను అదే పనిగా ప్రోత్సహించింది. కానీ నేతల మధ్య సమన్వయం కుదరక పోవడంతో అనేకవివాదాలు తలెత్తి చేరికల ఆగిపోయాయి.అందుకే ఇంకా కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కి క్రియ శీలంగా ఉండే లీడర్ల లీడర్లు పోయారు. అందుకే సర్పంచ్ యంపిటీసీ లు ఎక్కువమంది గెలిస్తే పార్టీ మరోసారి క్షేత్ర స్థాయిలో బలోపేతం అయ్యే ఛాన్స్ వుంటుంది.లోకల్ బాడి ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించే బాధ్యత కూడా ఎమ్మెల్యే లతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతల మీదే పెట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments