HomeCRIMEఢిల్లీ లో భారీ పేలుడు .....కారులో పేలుడు పదార్థాలు .......ఎర్రకోట మెట్రో వద్ద ఘటన ......ఒకరు...

ఢిల్లీ లో భారీ పేలుడు …..కారులో పేలుడు పదార్థాలు …….ఎర్రకోట మెట్రో వద్ద ఘటన ……ఒకరు మృతి …….ఎనిమిది కార్లు ధ్వంసం

దేశ రాజధాని ఢిల్లీ లో సోమవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. ఈ ఘటన లో ఒకరు మృతి చెంది నట్టుగా చెప్తున్నారు. ఎర్రకోట సమీపం లో గెట్ నెంబర్ ఒకటి వద్ద మెట్రో స్టేషన్ సమీపం లో ఈ పేలుడు జరిగింది. పక్కనే చాందిని చౌక్ మార్కెట్ ఉంది వేలాది మంది తో ఈ ప్రాంతం కిటకిట లాడుతుంది.

ఈ భారీ పేలుడు తో జనం భయబ్రాంతులకు గురయ్యారు ఎవరికీ వారే తమ వాహనాలు వదిలేసి పరుగులు పెట్టారు. మెట్రో స్టేషన్ వద్ద ఆగి ఉన్న కారు లో పేలుడు పదార్థాలు వల్లే ఈ పేలుడు జరిగింది.

కారు లో ఉన్న వ్యక్తి మృత దేహం పూర్తిగా ఛిద్రం అయింది.దాదాపు 20 కి పైగా వాహనాలు ధ్వసం అయ్యాయి. ఎనిమిది ఫైర్ ఇంజన్ లు సంఘటన స్థలానికి వచ్చాయి. పేలుడు జరిగిన ప్రాంతం ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments