నిజామాబాద్ వస్తున్న ఓ రైలులో వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ రైల్వే పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది. ధర్మాబాద్ నుంచి నిజామాబాద్ కు వస్తున్న రైలులో ఓ వ్యక్తినీ దారుణంగా హత్యాయత్నం చేశారు.
దీంతో రైలు నిజామాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోగానే వెంటనే క్షతగాత్రున్ని హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
