జిల్లా జనరల్ ఆసుపత్రి లో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ బంగారం మాయమైంది. ఈ ఘటన నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
ఇందల్వాయి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన సాయి రెడ్డి,భార్య సావిత్రి పని నిమిత్తం కామారెడ్డి వెళ్లారు. ఈ మేరకు తిరిగి వెళ్లి వస్తున్న క్రమంలో సదాశివ నగర్ జాతీయ రహదారి పై సావిత్రి ప్రమాదవశాతు ద్విచక్ర వాహనం పై నుంచి పడి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో వెంటనే హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఈ మేరకు ఆమె నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె చెవికి కమ్మలు మాయమయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అక్కడే ఉన్న సెక్యూరిటీ నీ నిలదీశారు.
చోరీ విషయం తెలుసుకున్న రోగి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రోగులకు భద్రత లేదా? సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ చోరీ జరిగింది” అని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
