మీడియా దిగ్గజం ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని హైదారాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో చేర్చారు.. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి మరింత విషమించింది .
రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఆయన అంతక్రియలు ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రభుత్వ లాంచనాలతో జరగనున్నాయి.
ఆయన కు ఇద్దరు కొడుకులు కాగ పెద్దకొడుకు కిరణ్ చిన్నకొడుకు సుమన్ క్యాన్సర్ తో గత ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. 1936లో నవంబర్ 16న గుడివాడ కృష్ణా జిల్లాలో ఓ రైతుకుటుంబంలో జన్మించారు. ఈయన తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. రామోజీరావు పూర్వీకు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందగా, అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు.
రామోజీరావు తన తాత రామయ్య మరణించిన 13 రోజులకు జన్మించాడు. దీంతో కుటుంబ సభ్యులు తన తాత జ్ఞాపకార్థం రామోజీకి రామయ్య అనే పేరు పెట్టారు. కానీ తాను ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడే సొంతంగా తన పేరును తానే సృష్టించుకొని, రామోజీరావు అని పెట్టుకున్నాడు. , గుడి వాడ కళశాలలో ఇంటర్, బీఎస్సీ పూర్తి చేశారు.
1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కూమార్తె రమాదేవిని వివాహం చేసుకున్నారు. అనేక సంస్థలు స్థాపించి వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యం ఉన్న రామోజీ జీవితం లో నిలదొక్కుకోవడానికి అనేక వ్యయప్రయాసలే ఓర్చారు. వ్యాపార సంస్థలు మొదలు పెట్టక ముందు ఆయన ఢిల్లీ లో పొట్టకూటి కోసం ఢిల్లీలోని ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఆయన తొలిసారి ఉద్యోగంలో చేరాడు.
అదే ఆయన మొదటి ఉద్యోగం.కొంత కాలం పనిచేసిన అనుభవం తో స్వతహాగా ప్రకటన ఏజెన్సీ ని స్థాపించె ఆలోచన చేసారు కానీ సతీమణి సూచనతో చిట్ ఫండ్ రంగంలోకి వెళ్ళాడు 1962లో మార్గదర్శి చిట్స్ ప్రారంభించారు. ఇదే ఆయన జీవితంలో తొలి వ్యాపారం. తర్వతా కిరణ్ యాడ్స్ అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. వైజాగ్ లో డాబాగార్డెన్ సమీపంలో డాల్ ఫిన్ హోటల్ ను తర్వాత వసుంధర ఫర్టిలైజర్స్, అన్నదాత పత్రిక, ఈనాడు, ఊషాకిరణ్ మూవీస్, కళాంజలి, ప్రియా ఫఉడ్స్, ఈటీవీ, ఈనాడు, వసుంధర పబ్లికేషన్స్ ఇలా ఎన్నింటినో స్థాపించి వ్యాపారవేత్తగాఎదిగారు.కానీ….
ఈనాడు తోనే ఖ్యాతి ……ఫిల్మ్ సిటీ తో గుర్తింపు
అనేక వ్యాపార సంస్తలు ఏర్పాటు చేసిన రామోజీ ఈనాడు పత్రిక తో ఎంతో ఖ్యాతి పొందారు. దాదాపు దశాబ్దాల కాలం పాటు శ్రమించి రెండు వేల ఎకరాల్లో నిర్మించిన ఫిల్మ్ సిటీ ఆయన పేరు విశ్వవ్యాప్తం అయింది. 1974 లో వైజాగ్ లో అయిదు వేల కాపీల తో మొదలైన ఈనాడు మరో రెండు మాసాలలో 50 ఏళ్లలో అడుగుపెట్టబోతుంది.
ఉదయం వార్త సాక్షి లాంటి పత్రికలు ఈనాడు ను దాటేయడానికి అనేక ప్రయత్నాలు చేసాయి. కానీ ఆయన ఈనాడు లో ఫ్రై స్థాయిలోనే కిందిస్థాయి సిబ్బంది పనితీరును కూడా పర్యవేక్షించే వారు.
మొదటి పదేళ్లు జిల్లాస్థాయిలో జరిగే ఈనాడు కంట్రిబ్యూటర్ ల సమావేశాలకు వచ్చే వారు క్రమశిక్షణ వృత్తి నిబద్దత విషయంలో అత్యంత కఠినంగా ఉండే వారు ఈనాడు లో పనిచేసే వారిమీద ఏ చిన్న ఆరోపణ వచ్చిన క్షేత్ర స్థాయిలో విచారణ జరిపేవారు. నిజాయితీ పనిచేసే వారికి అండగా ఉండేది.