అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగర శివారు లోనీ ధర్మారం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ (32) అనే వ్యక్తి నగరంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాడు.
శుక్రవారం రాత్రి అనుమానా స్పదంగా డిచ్ పల్లి పరిధి లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీస్ లు వెల్లడించారు. అయితే మృతి చెందిన వ్యక్తి యొక్క ద్విచక్ర వాహనం ఇందల్వాయి పరిధి ఉన్నట్టు సమాచారం అందింది. దీనిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
కుటుంబం సభ్యులా ఫిర్యాధు మేరకు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్ పల్లి ఎస్ఐ వెల్లడించారు.