బడి బస్సులు భద్రమేనా…?మరో వారం రోజుల్లో తెరుచుకొనున్న విద్యాసంస్థలు,పాఠశాలలు..బస్సుల స్థితిగతులపై రవాణా శాఖ దృష్టిసరించేనా?జూన్ 12 నుంచి పాఠశాలలో పున ప్రారంభం కానున్నాయి.
నిజామాబాద్ జిల్లా పరిధిలో గల పలు ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు భద్రంగానే వెళుతున్నారా? అనే అంశంపై రవాణాశాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు పాఠశాలలో ప్రారంభంధించడానికి ముందే పరీక్షించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొందరు విద్యా సంస్థల యజమానులు రోజు విద్యార్దులను బడికి తీసుకొచ్చే బస్సు భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నారని విమర్శలు వినిపిస్తోన్నాయి.
రవాణా శాఖ దృష్టి సాధించడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ బస్సుల లో ప్రయాణించి బస్సు కండిషన్ విద్యార్థుల తరలింపు వివరాలు ఇప్పటికప్పుడు తెలుసుకోవాలి. క్లీనర్ అటెండర్ ఉన్నారా? లేదా? అని నిర్ధారించుకోవాలి.
స్కూల్ బస్సు డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలి. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లొద్దు. డ్రైవర్ హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడకుండా చర్యలు చేపట్టాలి. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలి.
60 ఏళ్లు దాటిన వారిని డ్రైవర్గా కొనసాగించడం తగదని అధికారులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో 600 లకు పైచిలుకు బస్సులు ఉన్నాయి.ఇప్పటి వరకు వాటిలో కేవలం 300వరకు మాత్రమే ఫిట్ నెస్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాయని అధికారులు తెలిపారు.
15సంవత్సరాలు దాటిన యథేచ్ఛగా నడుపుతున్న బస్సులను తనిఖీ చేసి వాటిని సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.విద్యాసంస్థలు బస్సులు తప్పని సరిగా ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకోవాలి.
లేదంటే చేయించని వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధిస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు.



