Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadఆర్మూర్ లో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ ఖరారు ……ఆలూర్ నుంచి ఆర్మూర్ దాక …….రెండు...

ఆర్మూర్ లో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ ఖరారు ……ఆలూర్ నుంచి ఆర్మూర్ దాక …….రెండు రోజులు ఆర్మూర్ లోనే మకాం …

వచ్చేనెల జిల్లాలోని ఆర్మూర్ లో జరగనున్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ల పాదయాత్ర శ్రమదానం కార్యక్రమం లకు సంబంధించి షెడ్యూల్ ను ఖరారు చేశారు.

డీసీసీ అధ్యక్షులు తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన బుధవారం ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్ హాల్లో ముఖ్య నాయకులు సమావేశం జరిగింది.

ఈ ఇద్దరు అగ్ర నేతల పాదయాత్ర రూట్ మ్యాప్ పీసీసీ నుంచి రావడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజల ను ఎలా సమీకరించాలనేది ఈ భేటీ లో చర్చించారు. శనివారం మరియు ఆదివారం (ఆగస్ట్ 2,3 తేదీలలో) రెండు రోజుల పాటు శ్రమదానం తో పాటు పాదయాత్ర సాగనుంది అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకులు, ప్రజ ప్రతినిధులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.


ఈ కార్యక్రమం ఆలూర్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆర్మూర్ పట్టణం వరకు పాదయాత్ర చేస్తూ, స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. రాత్రికి ఆర్మూర్ పట్టణం C కన్వెన్షన్ హాల్ లో బస చేసి, శ్రమదానంలో పాల్గొంటారు

పాదయాత్రను కవర్ చేయనున్న గ్రామాలు మరియు పట్టణం

ఆలూర్ మండల
కేంద్రం నుంచి గగ్గుపల్లి మీదుగా
ఇస్సపల్లి
ఆర్మూర్ పట్టణం
పెద్ద బజార్ మీదుగా పాత బస్టాండ్ వరకు సాగుతుంది.

ఈ సమావేశంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి , మాజీ నిజామాబాద్ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారు మంద మైపాల్ గారు రవి గారు భూమేష్ రెడ్డి గారు చిన్నారెడ్డి గారు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!