HomeTelanganaNizamabadపేద ప్రజలున్న ప్రాంతాలకు రేషన్ షాప్ లు తరలించాలి .........ఆర్డీవో ను కోరిన యంఐయం

పేద ప్రజలున్న ప్రాంతాలకు రేషన్ షాప్ లు తరలించాలి ………ఆర్డీవో ను కోరిన యంఐయం

నిజామాబాద్ నగరం భౌగోళికంగా విస్తరించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా రేషన్ షాప్ లు ఏర్పాటు చెయ్యాలని యంఐయం ఆర్డీవో ను కలిసి కోరింది. జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ నగర అధ్యక్షుడు షకీల్ ల అద్వర్యం లో ప్రతినిధి బృందం ఆయను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

, గాజుల్‌పేట ప్రాంతం నుండి జోన్-3 వాటర్ ట్యాంక్ వరకు ఉన్న రేషన్ షాపుల కు సుదూర ప్రాంతాలనుంచి వచ్చి సరుకులు తీసుకుంటున్నారని ముఖ్యంగా, మదీనా ఎక్స్ రోడ్, ధర్మపురి హిల్స్, బాబన్ సాహబ్ పహాడీ ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు, ప్రతినెలా నిత్యావసర సరుకుల కోసం 4 నుండి 5 కి.మీ దూరం నుంచి రేషన్ షాప్ లకు రావాల్సి వస్తుందని

ఈ ప్రయాణానికి వారు ఆటో రిక్షా ఖర్చులను భరించాల్సి వస్తోంది, దీని కారణంగా పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడం ఆర్థిక భారంగా మారిందన్నారు . ఇటీవల అక్బర్ బాగ్ డివిజన్ నెం. 14లో మంజూరైన రేషన్ షాప్ సర్వీస్ పాయింట్‌ను, డివిజన్ నంబర్ 11 (బాబన్ సాహబ్ ఎక్స్ రోడ్ కు డివిజన్ నంబర్ 12 మరియు 13 (మదీనా ఎక్స్ రోడ్)వద్ద ఏర్పాటు చేయాలని వారు కోరారు .

ఈ ప్రాంతాల్లోని పేద ప్రజలుండే నివాస సముదాయాలు ఎక్కువగా ఉన్నాయని పేద ప్రజలతో, రోజువారీ వేతన సంపాదకులు, కార్మికులతో జనసాంద్రత ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు ప్రజల సౌకర్యం కోసం ఈ ప్రాంతాల్లో రేషన్ షాప్ సర్వీస్ పాయింట్లను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఉన్న రేషన్ షాప్ లను ఆయా ప్రాంతాలకు తరలించాలని లేని పక్షంలో కొత్తగా మరికొన్ని షాప్ లు మంజూరి చేయాలన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments