మినీ బార్ గా మారిన కమ్యూనిటీ హల్ లో బుధవారం అర్ధరాత్రి ట్రైనీ ఐపీఎస్ చైతన్య రెడ్డి,రూరల్ ఎస్ఐ మహేశ్ తో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. గూపన్ పల్లి శివారు లో మోటాడు రెడ్డి కమ్యూనిటీ హల్ ని గ్రామానికి ఓవ్యక్తి మినీ బారు ఏర్పాటు చేసుకొని అర్ధరాత్రి వరకు సిట్టింగులు చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు.
స్థానికులు ఈ విషయాన్ని ట్రైన్ ఐపీఎస్ చైతన్య రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఆమె నేరుగా వెళ్లారు. నిర్వాహకుడి తోపాటు మద్యం సేవిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు