అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లాలో క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది.
లోకసభ ఎన్నికల్లో సానుకూల ఫలితాల కోసం పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ బిఆర్ యస్ నేతలనే లక్ష్యంగా చేసుకొని వలసలకు తెరలేపింది.ముఖ్యంగా స్థానిక సంస్థలను హస్తగతం చేసుకోవడం ఫై దృష్టిపెట్టింది .లోకసభ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా భారీ వలస. లకు తెరలేపింది. ఓకే రోజు రెండు స్థానిక సంస్థలను తమ ఖాతా లో వేసుకుంది.డీసీసీబీ తో పాటు ఆర్మూర్ మున్సిపాలిటి ని హస్తగతం చేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సానుకూల ఫలితాలు సాధించలేక పోయింది.బిఆర్ యస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే లున్న నియోజకవర్గాల్లోనూ ఆపార్టీ కి వలస ల బెడద తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు నియోజకవర్గాల్లో పట్టు సాధించడానికి వలస అస్రం సంధిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్ యస్ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. గురువారం ఒకే రోజు రెండు కీలకమైన స్థానాలను హస్తగతం చేసుకున్నాయి. అత్యంత కీలక మైన జిల్లా సహకార బ్యాంకు ఛైర్మెన్ తో పాటు ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్మెన్ లను తమ ఖాతాలో వేసుకుంది.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు నాలుగేళ్ళ క్రితం జిల్లా సహకార బ్యాంకు ఛైర్మెన్ గా నియామకం అయ్యారు. బ్యాంకు పాలక మండలి లో 20 డైరెక్టర్లు బిఆర్ యస్ కు చెందిన వారే కనీసం ఒక్కస్థానం లేని కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస పక్రియ తో హస్తగతం చేసుకుంది.18 డైరెక్టర్లు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధం అయ్యారు.మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్న వైస్ ఛైర్మెన్ రమేష్ రెడ్డి నేతృత్వంలోనే డైరెక్టర్లు మూకుమ్మడిగా ఫిరాయించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెరవెనుక చక్రం తిప్పారు.
దిగ్గజ నేతగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచిన ప్పటికి తనయుడు పదవిని కాపాడలేక పోయారు. అలాగే 36 మంది కౌన్సిలర్ లున్న ఆర్మూర్ మున్సిపాలిటీ లో 32 మంది బిఆర్ యస్ సభ్యులుంటే బీజేపీ 2 కాంగ్రెస్ సభ్యుడు ఒక్కరే ఉండే. కానీ రెండు దఫాలుగా 24 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోచేరారు. దీనితో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఛైర్మెన్ ను తప్పించారు.గురువారం కొత్త ఛైర్మెన్ ఎన్నిక గురువారం నిర్వహించారు.అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయిన కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి కౌన్సిలర్లు పార్టీ పిరాయించేలా పావులు కదిపారు.
మరో వైపు కామారెడ్డి లోనూ పిరాయింపు లకు తెరలేచింది. ఛైర్మెన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పది మంది బిఆర్ యస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోవెళ్లారు. మరో నలుగురు చేరితే ఛైర్మెన్ స్థానం హస్తగతం అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మరో కీలక స్థానం జడ్పి ఛైర్మెన్ ను సైతం హస్తగతంచేసుకునే వ్యూహరచన సాగుతుంది. ఈపాటికే వైస్ ఛైర్మెన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. లోకసభ ఎన్నికలలోపే మెజార్టీ జడ్పిటిసి సభ్యులను తమ వైపు లాగేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేసారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోను పాగ వేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. 50 మంది సభ్యులున్న కార్పొరేషన్ లోఅసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఒక్కరే ఉన్నారు. కానీ దాదాపు అరడజన్ మంది కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. 17 మంది ఉన్న యంఐయం మద్దతు కార్పొరేషన్ లోనూ పాగ వేసే దిశగా పావులు కదులుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పదుల సంఖ్యలో యంపిటిసి లు మాజీ సర్పంచ్ లు బిఆర్ యస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలకే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లుగా కొనసాగిస్తుంది. పాలన పార్టీ వ్యవహారాల్లో వారే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. లోకసభ ఎన్నికల్లో తమ నియోజకవర్గం లో వోట్లు సాధించలేని పక్షంలో పార్టీ తమ ప్రాబల్యం తగ్గుతుందనే ఆందోళన ఓడిన నేతలను వెంటాడుతుంది. అందుకే బిఆర్ యస్ లో క్రియాశీలకంగఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలోకిరావాలని ఒత్తిడి చేస్తున్నారు. యంపిపిలు జెడ్పిటిసి లకు భవిష్యత్తు భరోసా ఇస్తూ కాంగ్రెస్ కండువా కప్పుతున్నారు.