HomePOLITICAL NEWSArmoorమత్తు పదార్థాల సరాఫరాను ఉపేక్షించం- మంత్రి జూపల్లి కృష్ణారావు- మోర్తాడ్, భీంగల్, ఆర్మూర్ లో కార్యాలయాలను...

మత్తు పదార్థాల సరాఫరాను ఉపేక్షించం- మంత్రి జూపల్లి కృష్ణారావు- మోర్తాడ్, భీంగల్, ఆర్మూర్ లో కార్యాలయాలను ప్రారంభించిన మంత్రి- ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, నాయకులు- పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన మంత్రి జూపల్లి..

మత్తు పదార్థాల సరఫరాను ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో మోర్తాడ్, భీంగల్, ఆర్మూర్ పట్టణాల్లో నిర్మించిన ఎక్సైజ్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని నూతన భవన సముదాయాలను ప్రారంభించారు.

మొదటగా ఎక్సైజ్ ప్రొహిబిషన్ మోర్తాడ్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన ఆయనకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్చార్జిలు ముత్యాల సునిల్ కుమార్ , పొద్దుటూరీ వినయ్ కుమార్ రెడ్డిలు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు చేసి నూతన భవన ప్రారంభోత్సవం చేశారు. ఎక్సైజ్ శాఖ పనితీరును, వివరాలను ఎక్సైజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… బాల్కొండ నియోజకవర్గంలో గంజాయి సరఫరా లేదని, మాదకద్రవ్యాల వినియోగం సంపూర్తిగా నివరించామన్నారు.

కల్లులో కలిపే ఆల్ఫా జోమ్ రసాయనిక పదార్థాల నివారణకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

ప్రభుత్వాల వైఫల్యం వలె ప్రజలు మత్తు పదార్థాలకు బానిసలయ్యారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ లు సుంకేట అన్వేష్ రెడ్డి, తాహెర్ బిన్ సందీప్, ఆర్డిఓ రాజా గౌడ్ లతోపాటు ఎక్సైజ్ అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments