నగరంలోని రూరల్ మండలంలోని నాలుగురోజుల క్రితం అదృశ్యమైన వృద్ధురాలు మంగళవారం గుపన్ పల్లీ వాగులో శవమై కనిపించింది.వివరాల్లోకి వెళ్లితే.గుపన్ పల్లీ గ్రామానికి పానుగంటి రజవ్వ(85).
ఈ నెల 11న ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది.దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
ఈ మేరకు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు మిస్సింగ్ నమోదు చేశారు.
మంగళవారం గుపన్ పల్లీ వాగులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పానుగంటి రాజవ్వ గా గుర్తించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వృద్ధురాలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
