మహిళ అదృశ్యమైన సంఘటన నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ కథనం ప్రకారం నగరంలోని ఎల్లమ్మ గుట్ట కు చెందిన అట్లగట్ల లక్ష్మి.
ఈ నెల 20 నాడు కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు తెలిపారు.
తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దాంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
