HomeCRIMEప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి...

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి…

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నందిపేట్ మండలంలో గురువారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే మండలం లోని రాజ్ నగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన పత్రి కన్నయ(35).

భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వృతి రీత్యా కూలీ పనులు చేసుకుంటారు. మండలంలోని ఊర చెరువులో గణేష్ నిమజ్జనం అనంతరం విగ్రహాలకు ఉండే ఇనుప స్టాండ్ లను తొలగించి బయట విక్రయిస్తారు.

ఈ క్రమంలో చెరువులో దిగి ఇనుప స్టాండ్ లను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments