HomeTelanganaNizamabadఇందిరమ్మ ఇళ్లపై ఉమ్మడి జిల్లా సమీక్ష లో ఎమ్మెల్యే ధన్ పాల్ ... అర్బన్ నియోజకవర్గ...

ఇందిరమ్మ ఇళ్లపై ఉమ్మడి జిల్లా సమీక్ష లో ఎమ్మెల్యే ధన్ పాల్ … అర్బన్ నియోజకవర్గ సమస్యల ప్రస్తావన..

ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై హైదరాబాదులోని హౌసింగ్ కార్పొరేషన్ లో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉమ్మడి జిల్లా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా నాగారం తో పాటు కొత్త కలెక్టరేట్ వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని కోరారు.

ఇప్పటికే పూర్తయిన ఇల్లు మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. గతంలో పలు వస్తువులు చోరీకి గురికాగా వాటిని మరమ్మతులు చేసిన కేటాయించకపోవడంతో మళ్లీ అదే దుస్థితి నెలకు ఉందని చెప్పారు. అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కేటాయించలేదని, అర్హులైన పేదలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు.

*10వ తేదీ లోపు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు…అర్బన్ నియోజకవర్గంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మే 10వ తేదీ లోపు కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

అలాగే నాగారంలోని బేస్మెట్ లెవెల్ లో ఉన్న వాటిని కూడా అతి తొందరలో పూర్తి చేసి అందజేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పిడి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments