HomeCRIMEఇటుకల ఫ్యాక్టరీ కూలిన క్రేన్ ముగ్గురు మృతి

ఇటుకల ఫ్యాక్టరీ కూలిన క్రేన్ ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలోగలఓ సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

శంకరపల్లి మండలం మహాలింగాపురంలో ఉన్న ఎన్ సీసీ (NCC) సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం వేళ కార్మికులు విధుల్లో ఉండగా, అకస్మాత్తుగా వాతావరణం మారి భారీ ఈదురుగాలులు వీచాయి. గాలుల ధాటికి కంపెనీలోని భారీ క్రేన్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కార్మికులపై పడింది.

ప్రమాద సమయంలో అక్కడ మొత్తం 13 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం శంకరపల్లి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments