రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నిజామాబాద్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్) ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డా. నాగ మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
సోమవారం జరిగిన ఈ భేటీలో ఆసుపత్రిలోని ప్రస్తుత పరిస్థితులు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పీసీసీ అధ్యక్షుడిని కలిసి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుపత్రి బలోపేతానికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
