హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు . సోమవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .
ఆదివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనలో ఆయనపై మూడు కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పీఏ కత్తురోజు వినోద్ అలియాస్ గిరి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
ఈ నేఫథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా శాసనసభ స్పీకర్ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ వన్ టౌన్ కు చేరుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కౌశిక్ రెడ్డి తీరుపై ఘాటుగా స్పందించారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ వెల్లింది. రాత్రి ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్ కు తరలించారు
