జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. ఆర్మూర్ కు చెందిన గంగారెడ్డి సుదీర్ఘ కాలంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసారు ప్రస్తతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో పసుపు రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు.
మూడేళ్ల పాటు ఆయన పదవిలో ఉండనున్నారు. రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో.. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్రం సోమవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ క్రమంలో గంగారెడ్డిని పసుపు బోర్డు ఛైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో బీజేపీ హామీ ఇవ్వగా.. తాజాగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ వెలువరించింది
