ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసారు.. సరిగ్గా ఇదే సమయానికి ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్ పోర్టు లో అడుగుపెట్టారు. ఆమెకు అరెస్ట్ వారంట్‌తో పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది.ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మధ్యాహ్నం నుంచి ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
లిక్క ర్ స్కాం కేసులో 4 గంటలపాటు ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నోటీసులిచ్చారు.విషయం తెలిసి బిఆర్ యస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో కవిత ఇంటికి చేరుకున్నారు. కేటీఆర్ హరీష్ రావు లు సైతం వచ్చారు. వారుకూడా కొద్దీ సేపు ఇంటిముందే బైటాయించారు. మోడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు