HomePOLITICAL NEWSకవిత ఇంట్లో ఈడీ సోదాలు …….ఫోన్ లు స్వాధీనం …….ఇంట్లోకి ఎవ్వరూ రాకుండా ఆంక్షలు

కవిత ఇంట్లో ఈడీ సోదాలు …….ఫోన్ లు స్వాధీనం …….ఇంట్లోకి ఎవ్వరూ రాకుండా ఆంక్షలు

లోకసభ ఎన్నికల వేల బిఆర్ యస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో శుక్రవారం ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, సిబ్బంది మొబైల్ ఫోన్లన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కవిత ఇంట్లో కేంద్ర దర్యాప్తు బృందాల సోదాల నేపథ్యంలో ఆమె తరుఫు న్యాయవాదులు సోదాలు జరుగుతోన్న ఇంటికి చేరుకున్నారు. బయటే అడ్డుకున్నారు. సోదాల నేపథ్యంలో కవిత న్యాయవాదులను ఇంట్లోకి రాకుండా అధికారులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ తో సహా పలుచోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్  కేసుకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన  పది మంది ఈడీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

 ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాడులు సోదాలు జరుగుతున్నాయి. దీంతో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు.  
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. మరోవైపు పలుమార్లు కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినా ఆమె విచారణకు హాజరుకాలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments