HomeTelanganaNizamabadపిడికిలి ఎత్తిన బతుకమ్మ .......సొంత జిల్లా ఫై స్పెషల్ ఫోకస్ .......మూడు రోజులుగా మకాం .......జిల్లాను...

పిడికిలి ఎత్తిన బతుకమ్మ …….సొంత జిల్లా ఫై స్పెషల్ ఫోకస్ …….మూడు రోజులుగా మకాం …….జిల్లాను చుట్టేస్తున్న వైనం …….దూరం అయినా క్యాడర్ ను చేరదీత …….మాజీ లకు చెక్

చాలాకాలం తర్వాత కవిత మెట్టినింట సందడి చేస్తున్నారు. జాగృతి వేదికగా చేసుకొని ఎమ్మెల్సీ కవిత మరోసారి పిడికిలెత్తారు.

పార్టీ లో ధిక్కార స్వరం ఎత్తిన తర్వాత మొదటి సారిగా జిల్లాకు వచ్చిన ఆమె ఈసారి ఏకంగా మూడు రోజులు ఇక్కడే మకాం వేశారు. గతంకు బిన్నంగా అడుగులేస్తున్నారు జిల్లాలో అన్ని సెగ్మెంట్ లను చుట్టేలా ఆమె జిల్లా పర్యటన సాగుతుంది.

మాజీ ఎమ్మెల్యే లతో పాటు కీలక నేతలు ఆమె టూర్ కు దూరంగా ఉన్నా సరే పార్టీకి దూరంగా ఉన్న క్యాడర్ ను ఆమె చేరదీస్తున్నారు. వారు మరోసారి కార్యశీలం అయ్యేలా భుజం తడుతున్నారు.

ముఖ్యంగా కవిత ను ఎవ్వరూ కలవద్దు అంటూ కొందరు మాజీ ఎమ్మెల్యే ల మెసేజ్ లను సీరియస్ గా పరిగణించారు. అందుకే వారికి చెక్ పెట్టేలా ఆమె రాజకీయ కార్యాచరణ సాగుతుంది. తదుపరి రాజకీయ ప్రస్థానం కు సొంత జిల్లా నే రోల్ మాడల్ భావిస్తున్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీ గా రెండో పర్యాయం కొనసాగుతున్న ఆమె ఈ అయిదేళ్ల కాలం లో జడ్పి, ఎంపీపీ ,మున్సిపల్ సమావేశాలకు డుమ్మా కొట్టారు.

ఈ సమావేశాలకు హాజరు కావాలని ఆమె అధికారులు సమాచారం ఇచ్చిన బిజీ షెడ్యూల్ తో జిల్లాకు పరిమితంగానే వచ్చారు. కానీరాబోయే రోజుల్లో జిల్లా ఫై స్పెషల్ ఫోకస్ పెట్టె ఆలోచనలో ఉన్నారు.

పార్టీ తో సంబంధం లేకుండా మాజీ ఎమ్మెల్యే ల నుంచి ఆటంకాలు లేకుండా జాగృతి వేదిక నుంచి తదుపరి రాజకీయ కార్యకలాపాలు సాగించ బోతున్నారు.ఇందులో బాగంగానే గతంలో జాగృతి లో చురుకుగా పనిచేసిన మరోసారి చేరదీస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం లో ఇదే వేదికగా బతుక్కమ్మ ఉత్సవాలతో ఊరూరా మహిళలను కదిలించారు.

మారుమూల ప్రాంతాల్లో ను ఆమె ఉద్యమంలో భాగంగానే బతుకమ్మ వేడుకలు చేసారు.అందుకే పార్టీ వేదికలకు అంటి ముట్టనట్లుగా నే ఉంటూ వచ్చారు. జిల్లాలో జాగృతి సంస్థ ను సంస్థాగతంగా పటిష్టంగా తయారు చేసారు.

ఉద్యమ కాలం లో జరిగిన ఉప ఎన్నికలతోనే రాజకీయాల్లో ఆమె మరింత క్రియాశీలం అయ్యారు.తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎంపీ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు తోలి ఎంపీ గా ఎన్నికయ్యారు. తెరాస సైతం అధికారంలోకి వచ్చింది.జిల్లాలో ఎమ్మెల్యే లందరూ తెరాస వారే గెలిచారు.

అప్పటి నుంచే జిల్లాలో జాగృతి కార్యకలాపాలు తగ్గిపోయాయి సొంత పార్టీ ఎమ్మెల్యే లే జాగృతి సభ్యులను దూరం పెట్టారు పార్టీ ప్రభుత్వ పదవులేవీ దక్కకుండా కట్టడి చేసారు.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లు చెప్పిందే వేదం ,ఫైనల్ అని అధినేత కెసిఆర్ పదే పదే స్పష్టం చేయడం తో కవిత సైతం నిస్సహాయులయ్యారు.పార్టీ పాలనా వ్యవహారాల్లో బిజీ అయ్యారు దాదాపు జాగృతి సంస్థ ఉనికి నామాత్రం అయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments