ప్రధాన మంత్రి మోదీ సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు. గంట ఆలస్యంగా ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు . .రూ. 6, 697 కోట్లతో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేస్తారు. ఇప్పటికే జిల్లా కేంద్రం ఎస్పిజీ, కేంద్ర బలగాల ఆధీనంలోకి తీసుకున్నాయి. .ఈసారి ప్రధాని మోడీ పాల్గొనే అధికార కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో కూడా పాల్గొనబోతున్నారు ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించే మోదీ భారీ బహిరంగ సభ కంటే ముందుగా జిల్లాలో సుమారు 6,697 కోట్లతో పలు పనులకు ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన సాగిస్తున్నాం. రూ.56వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. ఎన్టీపీసీ రెండో యూనిట్‌తో తెలంగాణ అవసరాలు తీరుతాయి. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని జాతికి అంకితం చేశాం. ఆర్ధిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం కలుగుతుంది.
దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నాం.
////////////////////////// సీఎం రేవంత్ రెడ్డి ////////////////////////////////////
మావైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలి. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్నలాంటివారు. విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించాం. దేశంలో ఐదు ట్రిలియన్ ఎకానమీ సాధనకు తెలంగాణ సహకరిస్తుంది.
కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించారు. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది. ఆదిలాబాద్‌కు నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహట్టి నిర్మించాలి. దీని కోసం భూసేకరణకు కావాల్సిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి.




