నగరంలోని ఐటీ కారిడార్ లో గంజాయి చెలామణి ఫై పోలీసులు దృష్టి సారించింది నానక్‌రామ్‌గూడలో కిరాణా షాప్ ముసుగులో యథేచ్ఛగా సాగుతున్న మాదకద్రవ్యాల విక్రయాలపై కొరడా ఝుళిపించారు.
గంజాయి డాన్‌గా పేరొందిన నీతూబాయికి చెందిన నెట్ వర్క్ ను ఛేదించే పనిలో పడ్డారు ఆదివారం ఓ ఆటోలో భారీగా గంజాయి తరలిస్తుండగా మాదాపూర్ ఎన్‌ఓటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు.
ఈ ఆపరేషన్‌లో ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సుమారు 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.26 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పట్టుబడిన గంజాయితో పాటు వాహనాన్నీ తదుపరి దర్యాప్తు కోసం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి నీతూబాయి కోసం స్పెషల్ టీం రంగంలోకి దిగింది
