యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఓ ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి నిర్వహించిన వీకెండ్ పార్టీ విషాదాంతమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న మంచిర్యాల జిల్లాకు చెందిన గండ్ల రాము అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. హైదరాబాద్‌లోని ఎన్‌సీఎల్ కంపెనీకి చెందిన సుమారు 15 మంది ఉద్యోగులు వీకెండ్ సందర్భంగా కొయ్యలగూడెం సమీపంలోని ఫామ్‌హౌస్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు కానీ పార్టీ లోనే .
రాము అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాము ఒంటి మీద ఎవరో కొట్టినట్లు గాయాలు ఉండటం, ఫామ్ హౌస్ లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్టీలో పాల్గొన్న అందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. రాము మృతికి పార్టీలో గొడవేమైనా కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
