కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ కాక్రాచో జనతా పార్టీ (సీజేపీ) ఆదివారం ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో చేపట్టిన ఆందోళనకు భారీ ఎత్తున నిరుద్యోగ యువకులు, పార్టీ మద్ధతుదారులు హాజరయ్యారు.
సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, హక్కుల కార్యకర్త సోనం వాంగ్ చుక్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ తదిరత ప్రముఖ వ్యక్తుల పాల్గొన్న ఈ ధర్నా.. నీట్ లీకేజీకి కారణమైన మంత్రి రాజీనామా డిమాండ్లతో మారుమోగింది.
ధర్నాలో పాల్గొన్న మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోనే నెంబర్ వన్ దుర్మార్గుడు మోదీ అని విమర్శించారు.
దేశంలో కనీసం పరీక్షలను సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. దేశద్రోహులను మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు.
