HomeTelanganaNizamabadమోగిన నగారా..సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల...డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు..అమల్లోకి ఎన్నికల కోడ్

మోగిన నగారా..సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల…డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు..అమల్లోకి ఎన్నికల కోడ్

నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

మూడు విడతల్లో ఎన్నికలు…

డిసెంబర్ 11వ తేదీన తొలి విడత,
డిసెంబర్ 14వ తేదీన రెండో విడత,
డిసెంబర్ 17వ తేదీన మూడో విడత

మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి,
రెండవ ఫేజ్ నామినేషన్ నవంబర్ 30వ తేదీ నుండి,
మూడవ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి

గ్రామాల్లో ఎన్నికల నగారా మోగింది గ్రామ పంచాయితీ లకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. మొదటి విడత పోలింగ్ వచ్చేనెల​11న, రెండో విడత 14న, మూడో విడత 17న జరుగనుంది.

ఓటింగ్​జరిగిన రోజునే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ రావడంతో ఇవాళ్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యాయి..

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగనుంది. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు, డిసెంబర్ 14న రెండో విడుత ఎన్నికలు, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి.

30వ తేదీ నుంచి రెండో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 3వ తేదీ నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారిణి రాణి కుముదిని స్పష్టం చేశారు.

ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 1077 గ్రామ పంచాయితీ లకు ఎన్నికలు జరుగబోతున్నాయి నిజామాబాద్ జిల్లాలో 545 కామారెడ్డి జిల్లాలో 532 గ్రామ పంచాయితీ లున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments