శాంతి భద్రతల నిర్వహణలో తరుచు తలెత్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి అవసరమైన కార్యాచరణ ఫై కమిషనర్ కసరత్తులు చేస్తున్నారు పోలీసింగ్ మరింత విస్తృతంగాఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే ఆయా స్టేషన్ లకు హౌస్ ఆఫీసర్ లుగా ఎస్సై ను తప్పించి సీఐ స్థాయి కి పెంచారు.
ముఖ్యంగా నగర పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది అధికారులు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా నే నిజామాబాద్ సబ్ డివిజన్ ను రెండు గా విభజించనున్నారు.
ప్రస్తుతం నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధి లో 16 పోలీసు స్టేషన్ లున్నాయి తెలంగాణ లోనే అతి పెద్ద సబ్ డివిజన్ లలో నిజామాబాద్ ఒకటి !విస్తృతమైన పరిధి వుండడం వల్ల ఏసీపీ లకు పనిభారం పెరుగుతుంది. అదీగాక విపత్తులు తలెత్తిన వెంటనే ఏసీపీ వెళ్లాలంటే గంటల తరబడి గా ఆలస్యం అవుతుంది.
ఎలాగో డిఎస్పీ స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నారు కాబట్టి నిజామాబాద్ రెండు సబ్ డివిజన్ ను రెండు గా విభజిస్తే మరో ఏసీపీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో వరంగల్ తర్వాత అతి పెద్ద నగరంగా ఉన్న నిజామాబాద్ నగరంలో ఈపాటికే ఆరు రూరల్ తో కలిపి ఏడు స్టేషన్ లున్నాయి.
అందుకే నగరశాంతి భద్రతల నిర్వహణ రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ఉండేలా నగరానికి ఏసీపీ ఉండేలా నిజామాబాద్ సబ్ డివిజన్ ను టౌన్ రూరల్ లుగా చెయ్యాలని కమిషనర్ సాయి చైతన్య ప్రతిపాదనలు సిద్ధం చేసి తదుపరి అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించారు డీజీపీ సైతం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆర్థిక పరిపాలన అనుమతులు తొందరలోనే వచ్చే అవకాశం ఉంది.
టౌన్ ఏసీపీ ఆఫీస్ ను ప్రస్తుతం ఉన్న ఏసీపీ ఆఫీస్ లోనే కొనసాగిస్తూ రూరల్ ఏసీపీ కార్యాలయం ను తాత్కాలికంగా బెటాలియన్ లో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు డిచ్ పల్లి దర్పలి జక్రాన్ పల్లి రూరల్ మోపాల్ పోలీసు స్టేషన్ లను రూరల్ ఏసీపీ పరిధి లోకి తేనున్నారు.
అరో టౌన్ ను సైతం సీఐ పరిధి లోకి తేనున్నారు. మరో వైపు సీసీఎస్ డిసిఆర్బీ ఎస్బి నార్కోటిక్ లతో పాటు టాస్క్ ఫోర్స్ వ్యవస్థలను సైతం మరింత పటిష్టం చేసే ఆలోచనలో సీపీ ఉన్నారు.
