HomeCRIMEనగరంలో మరింత పటిష్టంగా పోలీసింగ్ ……ఓకే దఫా రెండు స్టేషన్ లకు సీఐ లు కేటాయింపు

నగరంలో మరింత పటిష్టంగా పోలీసింగ్ ……ఓకే దఫా రెండు స్టేషన్ లకు సీఐ లు కేటాయింపు

నగరంలో పోలీస్ వ్యవస్థ ను మరింత పటిష్టంగా చేయడమే లక్ష్యంగా కమిషనర్ పక్క కార్యాచరణ ను సిద్ధం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పోలీస్ వ్యవస్థ మరింత మెరుగ్గా ఉండేలా ఆయా స్టేషన్ ల స్థాయి ని పెంచుతున్నారు. ఓకే దఫా రెండు స్టేషన్ ల స్థాయి ని పెంచుతూ సీఐ లను కేటాయించారు.

ఇక నుంచి ఆయా స్టేషన్ లకు సీఐ లు హౌస్ ఆఫీసర్ లుగా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా ఎస్సై లున్న రెండు స్టేషన్ లకు సీఐ లు రానున్నారు. ఇద్దరు ఎస్సై లు ఈపాటికి వుండగా వారు అలాగే కొనసాగనున్నారు. నాలుగు రూరల్ పోలీసు స్టేషన్ ల స్థాయి అంటే అప్ గ్రేడ్ అయ్యాయి.

నాలుగో టౌన్ సీఐ గా సతీష్ నియామకం కాగ నిజామాబాద్ రూరల్ కు శ్రీనివాస్ లు సీఐ లుగా నియామకం అయ్యారు శాంతి భద్రతల నిర్వహణలో వీరిద్దరూ సమర్థులుగా ముద్ర ఉన్న వారే కావడంతో కమిషనర్ సాయి చై తన్య ప్రజాప్రతినిధులసిఫారస్ లను సైతం సున్నితంగా పక్కకు పెట్టి వీరికి అవకాశం ఇవ్వడం గమనార్హం.

ఇటీవల హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన డిజిపి శివధర్ రెడ్డి ముందు కమిషనర్ ఈ రెండు స్టేషన్ ల అప్ గ్రేడేషన్ ప్రతిపాదనలు వుంచారు.

ఆయన అప్పటికప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. నగరం నాలుగు వైపులా అంచనాలకు అందనంత గా విస్తరిస్తుంది. నేరాలు శరవేగంగా పెరుగుతున్నాయి.అత్యంత సున్నిత ప్రాంతంగా ఉంది. ఏ చిన్న మతపరమైన వివాదం తలెత్తిన హైదరాబాద్ తరవాత నిజామాబాద్ లోనే అలర్ట్ చేస్తారు.

వీటితో పాటు రౌడీ మూకల ఆగడాలు ….దొంగతనాలు ..వీఐపీ తాకిడి కుడఎక్కువగానే ఉంది. అందుకే నగరంలో శాంతి భద్రతల నిర్వహణ పోలీసులకు కత్తిమీద సాములా వుంటుంది. నగర జనాభా కు తగ్గట్టుగా ఆరు స్టేషన్ ల తో పాటు రూరల్ ట్రాఫిఫ్ స్టేషన్ లు సైతం ఉన్నాయి.

కానీ పెరుగుతున్న నేరాల కు తగ్గట్టుగా ఎస్సై లు విధి నిర్వహణలో వ్యూహాత్మకంగా పనిచేయలేక పోతున్నారు. అదనంగా స్టేషన్ లు ఏర్పాటు చెయ్యడం సాంకేతికంగా సాధ్యం కాదు అందుకే ఆయా స్టేషన్ లను అప్ గ్రేడ్ ప్రతిపాదన లను తెరమీదికి తెచ్చారు.

నగరంలో ఇప్పటికే ఒకటో టౌన్ ఆర్మూర్ బోధన్ స్టేషన్ లు ఆప్ గ్రేడ్ అయ్యాయి. తాజాగా మరో స్టేషన్ లు సైతం ఆప్ గ్రేడ్ అయ్యాయి అలాగే మరో రెండు స్టేషన్ లను సైతం అప్ గ్రేడ్ చేసే ఆలోచనలో కొత్వాల్ ఉన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య ఉదంతం నేపథ్యంలో నగరంలో పోలీసింగ్ గట్టిగా చెయ్యాలనే పట్టుదలతో ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments