ప్రియుడి మోజులో పడి కసాయి తల్లి కన్న కూతురిని కడతేర్చింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఓల్డ్ అల్వాల్ లో జరిగింది. ఓల్డ్ అల్వాల్ కు చెందిన రేఖ అనే యువతి పెళ్లికి ముందే 7నెలల గర్భవతి అనే విషయం దాచి రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరవాత తన భార్య గర్భవతి అని తెలిసి వెంటనే రాజు ఆమెను వదిలి వెళ్లిపోయాడు.
ఆ తరవాత రెండు నెలలకు పాపకు జన్మనిచ్చిన యువతి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఓ కిరాణా షాపులో పనిచేసే సాయి అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకోగా అప్పటికే కూతురు ఉండటంతో యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు.
దీంతో తన పెళ్లికి కూతురు తన్విక(6) అడ్డంకిగా ఉందని భావించి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిని వాటర్ ట్యాంకులో పడేసి, మూత పెట్టి, ట్యాంకు నిండా నీళ్లు నింపి హతమార్చింది. అనంతరం ఏమీ తెలియనట్టు తన కూతురు కనిపించడం లేదు అంటూ లబో దిబో మంటూ ఏడ్చిచింది .
రేఖ సోదరి శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా నిందితురాలు మేడపైకి కూతురుతో వెళ్లి కిందకి ఒంటరిగా రావడం కనిపించింది.
దీనితో తల్లి ని అదుపులోకి తీసుకోని విచారించడంతో తానే ప్రియుడితో వివాహం కోసం హత్య చేసినట్టు ఒప్పుకుంది. దీనితో కేసు నమోదు చేసిఆమె ను అరెస్టు చేసారు
