ఈరోజు ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని వారి కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి మరియు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గార్లు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డి కి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల కల సాకారమైందనందున పసుపు రైతుల సంక్షేమానికి తోడ్పడాలని మంత్రి అన్నారు.
అంతేగాకుండా పసుపు ఎగుమతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై వారు చర్చించారు. బోర్డు విధి విధానాలు, డైరెక్టర్లు మరియు సభ్యుల ఎంపిక తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేశారు.
ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి తనను జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సమావేశంలో వారితోపాటు జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోరెపల్లి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
