నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ ఆద్వర్యంలో రెవెన్యూ అధికారులు,మరియు శానిటైజింగ్ అధికారులు సంయుక్తం గా శుక్రవారం నగరం లోని పలు హోటళ్ళ పై తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని హోటల్ లో కూడా తనిఖీలు చేసి, కల్తీ ఆహార పదార్థాలను నాసిరకం వంటలతో పాటూ కిచెన్‌లో అపరిశుభ్రతను గుర్తించి కపిల హోటల్ కు పదిహేను వేల రూపాయలు,లహరి హోటల్ హోటల్ పైన ఐదు వేల రూపాయలు జరిమానా వేశామని పేర్కొన్నారు.
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలో రెవెన్యూ ఆద్వర్యంలో నరేందర్ టీమ్, శనిటైజింగ్ ఆధ్వర్యంలో షాయిద్ అలీ టీమ్ పాల్గొన్నారు.