పోలీసు శాఖలో బదిలీ ల జాతర కు తెరలేసింది. సీఐ ఎస్సై స్థాయి లో బదిలీల కు సంబంధించి కమిషనర్ కల్మేశ్వర్ గత రెండు రోజులుగా ఎడతెగని కసరత్తులు చేశారు. ఎవరెవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనే విషయంలో ఆయనే స్వయంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు.
దీనితో ఈసారి కూడా ఎస్సై సీఐ పోస్టింగ్ లలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారస్ లకు ప్రాధాన్యత లేకుండా పోయిందనే టాక్ అధికారుల్లో వచ్చింది.
ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్ సబ్ డివిజన్ లలో సీఐ ఎస్సై పోస్టింగ్ ల మాటున కొందరు నేతలు వసూళ్ల తెగబడ్డారని కమిషనర్ దాక వెళ్ళింది. అందుకే బదిలీ లు పారదర్శకంగా ఉండేలా ఆయన పక్క ప్రణాళిక తో వ్యవహరిస్తున్నారు.
చాల కాలంగా పనిచేస్తున్న వారికి అలాగే పనితీరు సరిగా లేని కొందరు సీఐ లను బదిలీ కి రంగం సిద్ధం అయింది. ఒకటో టౌన్ యస్ హెచ్ వో విజయ్ ను బోధన్ సబ్ డివిజన్ కు పంపనున్నారు.
అలాగే బోధన్ లో ఉన్న శ్రీనివాస్ రాజు ను నిజామాబాద్ సబ్ డివిజన్ కు రానున్నారు అలాగే రూరల్ ట్రాఫిక్ విభాగాల్లోనూ సీఐ ల పోస్టింగ్ లు మారబోతున్నాయి.
కానీ అనేక వివాదాల నేపథ్యం ఉన్న ఇద్దరు సీఐ ల విషయంలో ఎలాంటి స్థానచలనం లేక పోవడం చర్చనీయాంశం అయింది.