రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన గురువారం రాత్రి నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం. మహారాష్ట్ర కు చెందిన అరవింద్(40) భార్య ఐదు నెలల కుమారుడు ఉన్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా నందిపేట్ లోని కేదారేశ్వర ఆశ్రమంలో అంటూ జీవనం గడుపుతున్నారు.
ఈ మేరకు గురువారం రాత్రి పనులు నిమిత్తం నందిపేట్ నుంచి కొత్తపల్లి వెళ్ళే మార్గ మధ్యంలో ఐలాపూర్ గ్రామం నందు గుర్తు తెలియని కారు ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయమయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.కారు వివరాల కొరకు పోలీసులు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.