నిజామాబాద్ పసుపు మార్కెట్ నుంచి గుంటూరు వెళ్తున్న పసుపు లోడ్ లారీని కొందరు దుండగులు మార్గ మధ్యంలో ఆపి హైజక్ చేశారని ఒకటవ టౌన్ పోలీస్ లు తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే.. సుమారు పసుపు విలువ 50 లక్షల విలువ గల లారీని ఈ నెల 17న పసుపు లోడ్ తో గుంటూరుకు బయలుదేరిన కొందరు దుండగులు ఇందల్వాయి టోల్ గేట్ వద్ద లారీని ఆర్టీఏ అధికారులమని చెప్పి రోడ్డు పై నిలిపారు.
లారి డ్రైవర్ రమేష్ వెంటనే యజమాని వెంకటేశ్వర్లు కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంకటేశ్వర్లు వారితో మాట్లాడిన వారు వినకుండా డ్రైవర్ కు మత్తు పదార్థాలు ఇచ్చి పడుకోబెట్టినటు తెలిపారు. దాంతో వారు సదరు లారీని గాంధారి ఎక్స్ రోడ్ వైపు లారీని మళ్ళించారు. అక్కడ లారికి ఉన్న జీపీస్ ను డిస్కనెక్ట్ చేశారని తెలిపారు.
అదే రోజు సాయంత్రం లారి ఇందల్వాయి టోల్ గేట్ దాటినట్లు తెలిపారు.ప్రస్తుతం జేపీస్ ట్రాక్ చేసి నవీపేట్ మండలం జన్నెపల్లి వద్ద లారీని గుర్తించారు.యజమాని ఫిర్యాదు మేరకు నవిపేట పోలీసులు హుటాహుటిన జన్నపల్లి వద్ద ఉన్న లారీని పట్టుకున్నారు.
లారీని అక్కడే వదిలేసి దుండగులు పరారీ లో ఉన్నట్లు తెలిపారు.యజమాని ఫిర్యాదు మేరకు ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయ్ బాబు పేర్కొన్నారు.