మట్కా ఆడుతున్న ఇద్దరు అరెస్టు…నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆద్వర్యంలో దాడుల్లో మట్కా ఆడుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే బోధన్ మండలం లోని విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఆన్లైన్ మట్కా ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి రూ.8680 నగదు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి విష్ణుమూర్తి తెలిపారు. ఈ దాడుల్లో సీఐ పురుషోత్తం,సిబ్బంది పాల్గొన్నారు.