మానవత్వం చాట్టుకున్న ఆటో డ్రైవర్ సలీం ఖాన్. తన ఆటోలో మరిచి వెళ్ళిన 16తులాల వెండి,ఇతర ఐడి లు ఉన్న కవర్ ను బాధితుల ఇంటికి వెళ్లి ఇచ్చారని బాధితులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే గురువారం నిజామాబాద్ నగరంలోని అర్శపల్లి కి చెందిన గొజ్జోగమ లక్ష్మీ పనులు నిమిత్తం నగరంలోని గంజ్ కామన్ కు వచ్చారు.అనంతరం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు సలీం ఖాన్ ఆటో లో వెళ్ళారు.
ఈ క్రమంలో ఇంటి వద్ద ఆటో దిగి వారి చేతిలోని కవర్ ను ఆటో లో మరిచి ఇంట్లొకి వెళ్లి పోయారు. బాధితులు హుటాహుటిన ఒకటవ టౌన్ పోలీస్కు వెళ్లి ఆటో డ్రైవర్ ఫిర్యాదు చేశారు.కొంత దూరం వచ్చి చూసేసరికి తన ఆటోలో మరిచి వెళ్ళిన 16తులాల వెండి,ఇతర ఐడి లు ఉన్న కవర్ ను బాధితుల ఇంటికి వెళ్ళాడు.
బాధితులకు ఫోన్ చేసి ఒకటవ టౌన్ పోలీస్ అధికారుల ముందు లక్ష్మి కి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇచ్చి మానవత్వం చటుకున్నడని టౌన్ సీఐ విజయ్ బాబు ఆటో డ్రైవర్‌ను ప్రశంసించారు.