నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి పడి కూలీ మృతి చెందిన ఘటన మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.
నిజామాబాద్ నగరంలోని బొర్గం(పీ)కు చెందిన బాలయ్య(45).వృతి రీత్యా మేస్త్రి పనులు చేసుకుంటారు.
ఈ మేరకు రోజు వారీగా బుదవారం పనులు నిమిత్తం మోపాల్ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న భవనపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ బుదవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ పేర్కొన్నారు.