నిజామాబాద్ నగర శివారులోని దాస్ నగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఘటనలో గాయపడ్డ చిన్నారి గురువారం మృతి చెందినట్లు సీఐ సతీష్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతి బాపులే గురుకుల పాఠశాల 8వ తరగతి చదువుతున్న శ్రీరామ్ ఈశ్వరి(13) ఈ నెల 14న ఆదివారం ఉన్నందున తండ్రి అయిన శంకర్ చూడడుకి వచ్చారు.
ఈమేరకు ఈశ్వరి భోజనం చేయించి రోడ్డు పక్కన నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్న సమయంలో నందిపెట్ నుంచి నిజామాబాద్ వైపుగా వస్తున్న కారు మద్యం మత్తులో ఒక్కసారిగా వారి పై కి కారు దూసుకెళ్లింది.
ఈ ఘటనలో చిన్నారి ఈశ్వరి కి తీవ్ర గాయాలయ్యాయి.హుటాహుటిన నిజామాబాద్ ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చిందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు తెలిపారు.డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ తెలిపారు.