మోపాల్ మండలం సిరిపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జే .రచన, ఎం .మాధురి ,ఎం మేఘనలు వురిమల్ల ఫౌండేషన్ , ఖమ్మం వారి జాతీయస్థాయి కథా ,కవితా బహుమతులు గెలుచుకున్నారని ప్రధానోపాధ్యాయులు వి .సత్యనారాయణ తెలిపారు.
గత ఏప్రిల్ మాసంలో వురిమల్ల ఫౌండేషన్, ఖమ్మం వారు జాతీయస్థాయిలో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు కథా రచన మరియు కవితల పోటీని నిర్వహించారు.
ఈ పోటీలో దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలలో నుండే కాకుండా ఇతర రాష్ట్రాలలోని తెలుగు విద్యార్థులు సైతం పాల్గొన్నారు. ఈ పోటీల ఫలితాలను ఆదివారం నాడు ఫౌండేషన్ అధ్యక్షులు వురిమల్ల సునంద మరియు సభ్యులు ప్రకటించారు.
ఈ పోటీలలో సిర్పూర్ ఉన్నత పాఠశాలకు నాలుగు బహుమతులు లభించాయి. జే రచన(10వ తరగతి – ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం)కు కథా మరియు కవితా రచనలో రెండు బహుమతులు, ఎం మాధురి (10వ తరగతి)కి కథా రచనలో,ఎం మేఘన(10వ తరగతి )కు కవితా రచనలో బహుమతులు లభించాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ అంతర్జాతీయ బహుమతులు సాధించాలని వారు కోరారు. విద్యార్థులను తెలుగు సృజన రంగంలో నిరంతరం ప్రోత్సహిస్తూ ఇలాంటి పోటీలకు మార్గదర్శనం చేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్లను వారు అభినందించారు.
బహుమతులు సాధించిన ఈ విద్యార్థులకు ఆగస్టు 24న ఖమ్మం లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ బహుమతుల కింద నగదును ,సర్టిఫికెట్ను, అలాగే మెమెంటోను ఫౌండేషన్ వారు అందించి సత్కరించ నున్నారు.
విద్యార్థుల ఈ అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామల ,మోహన్, గాయత్రి ,అక్బర్ బాషా, వందన ,డాక్టర్ హజారే శ్రీనివాస్ , లలిత పాల్గొన్నారు.
