ఈనెల 5వ తేదీ నుండి తమిళనాడు రాష్ట్రంలో జరిగే స్విమ్మింగ్ పూల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా మేఘనను ఎస్సార్ జూనియర్ కళాశాల డీజీమ్ గోనె గోవర్ధన్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డీజీమ్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సార్ కళాశాల నుండి చదువుతోపాటు రాష్ట్ర స్థాయి జాతీయస్థాయి క్రీడా పోటీలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
చదువులో ఐఐటి, జేఈఈ,ఎంసెట్ రాష్ట్రస్థాయి ర్యాంకులతో పాటు క్రీడల్లో రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడం మా SR జూనియర్ కళాశాలకు మంచి పేరు తీసుకొస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ యొక్క కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్, శ్రీకాంత్, డిన్ రాంబాబు, అకౌంటెంట్ రమేష్ రెడ్డి,ప్రిన్సిపల్స్ హనుమంతరావు,దేవేందర్ రెడ్డి ,యాగేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నరసింహారెడ్డి, మురళి, మహీపాల్ రెడ్డి,తదితరులు సిబ్బంది పాల్గొన్నారు….
