HomeEditorial Specialఇదీ సంగతి' కథనంకు స్పందన: మున్సిపల్ అధికారుల వేగవంతమైన చర్య - కుక్కల పట్టివేత!కొన్ని గంటల్లోనే...

ఇదీ సంగతి’ కథనంకు స్పందన: మున్సిపల్ అధికారుల వేగవంతమైన చర్య – కుక్కల పట్టివేత!కొన్ని గంటల్లోనే సమస్య పరిష్కారం – 36వ డివిజన్ ప్రజల హర్షం

‘నగరంలోని 36వ డివిజన్ లో వీధికుక్కల స్వైరవిహారం గురించి ‘ఇది సంగతి’ వార్తా కథనంముపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించారు. ఈ వార్త ప్రచురితమైన కొద్ది గంటల్లోనే మున్సిపల్ కమిషనర్ చొరవతో, ప్రత్యేక సిబ్బంది బృందం రంగంలోకి దిగింది.

స్థానికుల, ‘ఇదీ సంగతి’ ప్రతినిధి కథనం ఆధారంగా మున్సిపల్ సిబ్బంది కుక్కల పట్టివేత 36వ డివిజన్ వ్యాప్తంగా పలు వీధుల్లో గాలింపు చేపట్టి, వార్తల్లో పేర్కొన్న విధంగా గుంపులుగా ఉన్న పట్టుకున్నారు.

అధికారుల ఈ వేగవంతమైన, సమర్థవంతమైన చర్యకు 36వ డివిజన్ ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేని పరిస్థితి ఉండేదని, కానీ ‘ఇది సంగతి’ వార్త కథనంతో అధికారులు తక్షణమే స్పందించడం సంతోషాన్ని కలిగిస్తుందని కొనియాడారు.

ఇందుకు మున్సిపల్ కమిషనర్ గారికి, కమిషనర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు. ఇప్పుడు ప్రజలు కుక్కల భయం లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments